LATEST ARTICLES

ఐపీఎల్ సీజన్-18 కెప్టెన్ల సందడీ

(Images Source From IndianPremierLeague official Twitter account)

పదేళ్ల ఎదురు చూపులకు..15 నెలల్లో పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ తొలి ఏడాదిలో 57,924 ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వాలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొలువుల పండగ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖల్లో కారుణ్య, ఇతర నియామకాల కింద 922 మందికి ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక మోడల్ గా నిలబడిందని పేర్కొన్నారు. కుటుంబ...

గులాబీ జెండా కప్పుకున్న ప్రతి బిడ్డ వరంగల్ సభకు రావాలి:కేటీఆర్

భారతదేశ స్వాతంత్ర చరిత్రలో 25 ఏళ్లు విజయవంతంగా కొనసాగుతున్న అతికొద్ది పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ... ఈ దేశంలో తెలంగాణకు ఒక ప్రత్యేక అస్తిత్వం ఉందనీ, తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉందని ఎలుగెత్తి చాటిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, భారతీయ జనతా పార్టీ మరోవైపు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్...

 బిల్డ్‌నౌ పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

గత పదేళ్ల కాలంలో బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉత్పన్నమైన సమస్యలను తమ ప్రభుత్వం  ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బిల్డ్‌నౌ పోర్టల్‌ను  సీఎం ప్రారంభించారు . ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పూర్తి పారదర్శకంగా భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులకు ఆన్‌లైన్ ద్వారా అందించాలన్న ఉద్దేశంతో ఈ పోర్టల్ తీసుకొచ్చినట్టు చెప్పారు. ఇప్పుడు పేదోడు, పెద్దోడు అన్న తేడా లేదు. అందరూ పబ్లిక్ డొమైన్‌లో దరఖాస్తు చేసుకోవలసిందేనని సీఎం...

రేపటి నుంచే ఐపీఎల్ ప్రారంభం

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్-18 క్రికెట్ సందడి రేపటి నుంచే ప్రారంభం కానుంది. మార్చి 22న ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి మ్యాచ్ కోల్ కత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది.  

అమిత్ షా ను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు

తెలంగాణ బీజేపీ నేతలు పార్లమెంట్ హాల్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలను అమిత్ షా అభినందించారు. అలాగే రాష్ట్రంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉత్సాహంగా పనిచేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని రాష్ట్ర నేతలకు సూచించారు

జేపీ నడ్డాను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు

తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను నడ్డా అభినందించారు. అలాగే రాష్ట్రంలో పార్టీని మరింత బలపరచాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని రాష్ట్ర నేతలకు సూచించారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉద్యోగులకు రూ.6,200 కోట్లు చెల్లించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

మెగాస్టార్ కు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు

మెగాస్టార్ చిరంజీవి అరుదైన అవార్డును అందుకున్నారు. సినీరంగానికి ఆయన అందించిన సేవలకు గాను బుధవారం యునైటెడ్ కింగ్డమ్(యూకే)పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో బ్రిడ్జ్ ఇండియా సంస్థ "లైఫ్ టైమ్ అచీవ్ మెంట్" అవార్డును అందజేసింది. అనంతరం యూకే పార్లమెంట్ సభ్యులు, తదితరులు చిరంజీవిని సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిరంజీవికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

టీం ఇండియాకు బీసీసీఐ నజరానా

ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందుకున్న భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టీం ఇండియాకు రూ.58 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు బీసీసీఐ పేర్కొంది. అలాగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్నందుకు ఐసీసీ నుంచి  భారత క్రికెట్ జట్టుకు రూ.19.50 కోట్ల వరకు ప్రైజ్ మనీ లభించిన సంగతి తెలిసిందే.