భాజపా జిల్లా అధ్యక్షుల నియామకం

తెలంగాణ బీజేపీ 8 జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించింది. రంగారెడ్డి అర్బన్ – వానిపల్లి శ్రీనివాస్ రెడ్డి రంగారెడ్డి రూరల్- పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ మలక్ పేట – జె.నిరంజన్ యాదవ్ వికారాబాద్ – కొప్పు రాజశేఖర్ రెడ్డి జోగులాంబ గద్వాల – టి.రామాంజనేయులు నాగర్ కర్నూల్ – వేముల నరేందర్ రావు ఖమ్మం – నెల్లూరి కోటేశ్వర్ రావు భద్రాద్రి కొత్తగూడెం – బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

ఈనెల 20న సూర్యాపేటకు కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది.ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. మార్చి 20న సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్ జిల్లా నాయకులతో సమావేశం కానున్నారు.

బీసీ రిజర్వేషన్ల బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు.. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ పెంపునకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత సభలో బిల్లులపై చర్చ అనంతరం ఈ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

తెలంగాణ ప్రజాప్రతినిధులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. ఈనెల 24 నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

 బీఆర్ఎస్ నేతలతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరు అనటానికి ఈ సంఘటనే నిదర్శనం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము నిర్వహించబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా తీన్మార్ మల్లన్న భారాస నేతలను కోరారు.

నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోషయ్య పేరు పెడతాం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, ఆర్యవైశ్య సమాజం పట్ల తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉందని  ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రోశయ్య గవర్నర్ గా, సీఎంగా ఎన్నో సేవలందించారని గుర్తుచేశారు. బల్కంపేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రికి మాజీ గవర్నర్, మాజీ సీఎం కొణిజేటి రోశయ్య పేరు పెడుతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే ఆ ఆస్పత్రి...

చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెడదాం: సీఎం ప్రతిపాదన

తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు లేఖ రాస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదు...

పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు అవివేకమైన చర్య: ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త

తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని  అసెంబ్లీలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై బీజేపీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకస్తున్నామని ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. ఇది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఒక అవివేకపు చర్య అని పేర్కొన్నారు. తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చేది...

 అమరావతిలో 58 అడుగుల అమరజీవి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం : ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తెలుగుజాతి కోసం అమరజీవి చేసిన త్యాగాన్ని, సేవలను చంద్రబాబు గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. అలాగే 12నెలలు 12 విభిన్న కార్యక్రమాలు చేపడుతామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు...