VGన్యూస్: తెలంగాణలో మరో కొత్త ప్రాంతీయ రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో కవిత తన నూతన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. ఈ సభకు తెలంగాణ జాగృతి నాయకులు, కవిత అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. పార్టీ ప్రకటన అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి కవిత భారీ ర్యాలీగా హైదరాబాద్ కు చేరుకున్నారు.








