VGన్యూస్: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ (Neet Paper Leak) నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జరిగే వివిధ పోటీ పరీక్షల విధానంలో సంస్కరణలపై సిఫార్సుల కోసం హైపవర్డ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని (Nandan Nilekani) నేతృత్వంలో ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పనిచేయనుందని తెలిపారు. ఈ మేరకు ప్రధాని ఓ వీడియో విడుదల చేశారు. ఈ హైపవర్డ్ టాస్క్ ఫోర్స్ కమిటీలో నందన్ నిలేకనితోపాటు ఐదుగురు సభ్యులు ఉంటారు. ఇస్రో (ISRO) మాజీ ఛైర్మన్ ఎస్. సోమనాథ్, ఐబీ (IB) మాజీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్, లాజిస్టిక్స్,పరిపాలనా నిపుణుడు అమృత్ లాల్ మీనా సభ్యులుగా ఉన్నారు.










