VGన్యూస్: అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూర్ మండలంలో బుధవారం తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు డాక్టర్ చారకొండ వెంకటేష్ పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే వంగూర్ మండలంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులను సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా చారకొండ వెంకటేష్ మాట్లాడుతూ.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. ప్రతి పనిని పూర్తి బాధ్యతతో చేపట్టాలన్నారు.







