Home ఎన్నికలు అస్సాంలో మళ్లీ భాజపానే.. పుదుచ్చేరిలో ఎన్డీయేదే అధికారం..

అస్సాంలో మళ్లీ భాజపానే.. పుదుచ్చేరిలో ఎన్డీయేదే అధికారం..

VGన్యూస్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ విజయంతో బీజేపీ అస్సాంలో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. సోమవారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా 82 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఆ రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 19, బీఓపిఎఫ్ 10, ఏజీపీ 10, ఏఐయూడీఎఫ్ 02, ఆర్జేఆర్డీ 02, తృణముల్ కాంగ్రెస్ 01 స్థానంలో విజయం సాధించింది.
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిని ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. సోమవారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమిలోని ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12, బీజేపీ 04, అన్నాడీఎంకే 01, ఎల్జేకే పార్టీ 01 స్థానంలో విజయం సాధించాయి. కాంగ్రెస్, డీఎంకే అలయన్స్ రెండోస్థానానికే పరిమితమైంది.