Home ఎన్నికలు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

VGన్యూస్: కాంగ్రెస్ అధిష్ఠానం ఏడుగురు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను రాష్ట్రాల వారీగా ప్రకటించింది. కర్ణాటక నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పవన్ ఖేరా, మన్సూర్ అలీఖాన్‌ పేర్లను ప్రకటించింది. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌కు అవకాశం కల్పించారు. రాజస్థాన్ నుంచి నీరజ్ డాంగి, తమిళనాడు నుంచి ప్రవీణ్ చక్రవర్తి, జార్ఖండ్ నుంచి ప్రణవ్ ఝాకి రాజ్యసభ సీట్లను కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.