VGన్యూస్: 80వ సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా లోక్‌భవన్‌లో ఎట్ హోమ్ (At Home) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీతో పాటు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.







