VGన్యూస్: వీసా స్టీల్ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరక్టర్ ఆదిత్య ఆగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ బంగూర్‌లతో ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్ కతాలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనకు వ్యూహాత్మకంగా సంస్కరణలను అమలుచేస్తున్న తీరును వివరించారు. ఏపీ పారిశ్రామికాభివృద్దిలో భాగం కావాలని పారిశ్రామికవేత్తలను కోరారు.










