VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసమైన విద్యా వ్యవస్థకు మంత్రి నారా లోకేష్ పునర్జీవం పోశారని.ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ అన్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారంగంలో అనేక మార్పులను తీసుకొచ్చారని పేర్కొన్నారు. లీప్ (LEAP) కార్యక్రమంతో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ బడులను మంత్రి లోకేష్ తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. అందుకు ఉదాహరణగా మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు పాఠశాలను ఇంటర్నేషనల్ స్కూల్ మాదిరిగా తయారు చేశారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లోనూ ఇలాంటి సరికొత్త బడులు రాబోతున్నాయన్నారు.










