VGన్యూస్: ఐటిసి ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ సంజీవ్ పూరితో ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్ కతాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. అలాగే వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడగలిగే వంగడాల సృష్టి, అగ్రి ఫారెస్ట్రీ, ఆదర్శ గ్రామాల నిర్మాణంలో ఏపీతో కలసి పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.










