Home జాతీయం & అంతర్జాతీయం అల్యూమినియం ఉత్పత్తుల తయారీకి మంచి అవ‌కాశాలున్నాయి: మంత్రి లోకేష్

అల్యూమినియం ఉత్పత్తుల తయారీకి మంచి అవ‌కాశాలున్నాయి: మంత్రి లోకేష్

VGన్యూస్: శ్యామ్ మెటాలిక్స్ & ఎనర్జీ లిమిటెడ్ డైరక్టర్ షీతల్ అగర్వాల్, సూపర్ స్పెల్టర్స్ లిమిటెడ్ చీఫ్ మెంటర్ గోపాలకృష్ణ చరణ్, రష్మీ మెటాలిక్స్ లిమిటెడ్ డైరక్టర్ సంజీవ్ కెఆర్. పట్వారీలతో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్ కతాలో భేటీ అయ్యారు. ఎగుమతి ఆధారిత అల్యూమినియం ఉత్పత్తుల తయారీకి ఏపీలో మంచి అవ‌కాశాలున్నాయ‌ని తెలిపారు. అలాగే అల్యూమినియం ఫాయిల్, ఫ్లాట్-రోల్డ్ ఉత్పత్తులు, ఈవీ-గ్రేడ్ అల్యూమినియం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా శ్యామ్ మెటాలిక్స్‌ డైరక్టర్ షీతల్ ను కోరారు.