VGన్యూస్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మంత్రి ప్రహ్లాద్ జోషి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రిగా ఉన్నారు.







