VGన్యూస్: ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మెుదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ 67 బంతుల్లోనే 152 పరుగులు చేశాడు. 265 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 18.5 ఓవర్లలోనే 4 వికెట్లను కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది.










