VGన్యూస్: ఉత్కంఠ బరితంగా సాగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయ దుందుభి మోగించింది. గత 15 సంవత్సరాలుగా బెంగాల్ లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తృణముల్ కాంగ్రెస్ కంచుకోటలో కమలం వికసించింది. సోమవారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా ఏకంగా 206 స్థానాల్లో విజయం సాధించింది. బెంగాల్ లో భాజపా అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. తృణముల్ కాంగ్రెస్ 81, కాంగ్రెస్ 02, ఏజేయూపీ 02, సీపీఐ(ఎం) 01, ఏఐఎస్ఎఫ్ 01 స్థానంలో విజయం సాధించారు.










