VGన్యూస్: తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ మేడ్దుల రమేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనదన్నారు. ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ఓటర్లందరిపైన ఉందని తెలిపారు. అర్హత కలిగిన ఓట్లను తొలగించకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాండవుల మహేష్, బీఎల్‌వోలు లక్ష్మీబాయి, శారద, బీఎల్ఏలు సింహాద్రి, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.










