VGన్యూస్: బిహార్ లో కమలం పార్టీ కంచుకోటైన బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ (JSP) విజయం సాధించింది. ఆ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి భాజపా అభ్యర్థి నీరజ్ కుమార్ పై దాదాపు 18 వేలపై ఓట్ల ఆధిక్యంతో విజయ దుందుభి మోగించారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత నితిన్ నబీన్ రాజ్యసభకు నామినేట్ కావటంతో బంకీపూర్ (Bankipur) ఉప ఎన్నిక అనివార్యమైంది.










