Home క్రీడలు & సినిమా శ్రేయస్ శతకం.. పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం

శ్రేయస్ శతకం.. పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం

VGన్యూస్: లక్నోలోని అటల్ బిహారి వాజ్ పేయి స్టేడియంలో శనివారం జరిగిన కీలక మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. టాస్ గెలిచిన పంజాబ్ మెుదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లు జోష్ ఇంగ్లిస్ 72, ఆయుష్ బదోని 43 పరుగులతో రాణించారు. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 18 ఓవర్లలోనే 3 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ(101*), ప్రభ్ సిమ్రన్ సింగ్ 69 పరుగులతో రాణించారు. శ్రేయస్ అయ్యర్ కి ఐపీఎల్ లో ఇదే మెుదటి సెంచరీ.