VGన్యూస్: ఫీఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా అట్లాంటా స్టేడియంలో అర్జెంటినా, ఈజిప్ట్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్‌పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి మ్యాచ్‌ను తిలకించారు. ఆద్యంతం విద్యార్థుల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య వీక్షణ కార్యక్రమం కోలాహలంగా సాగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటినా 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది.










