Home క్రీడలు సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా నైట్ రెడర్స్

సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా నైట్ రెడర్స్

VGన్యూస్: కోల్‌కతా నైట్ రెడర్స్, లక్నోసూపర్ జెయింట్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా కొనసాగింది. చివరికి సూపర్ ఓవర్ కు దారితీసింది. మెుదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రెడర్స్ 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రింకు సింగ్ 51 బంతుల్లో 83 పరుగులతో రాణించాడు. 156 టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేసింది. ఇరుజట్ల స్కోరు సమానం కావడంతో సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్ లో కోల్‌కతా నైట్ రెడర్స్ విజయం సాధించింది.