Home తాజా వార్తలు స్వీయ జనగణనలో పాల్గొన్న సీఎం రేవంత్

స్వీయ జనగణనలో పాల్గొన్న సీఎం రేవంత్

VGన్యూస్: భారత ప్రభుత్వం చేపట్టిన జనగణన-2027లో భాగంగా స్వీయ జనగణనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. స్వయంగా సీఎం తన వివరాలను అధికారిక వెబ్ సైట్ లో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో ప్రజలంతా విశేషంగా పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జనాభా లెక్కల కార్యక్రమంలో ముందుగా చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి, GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ , జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక అల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.