VGన్యుస్: సికింద్రాబాద్ ఆవులమందలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం వాసవిమాత జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ కల్వ సుజాత గుప్త, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.










