VGన్యూస్:కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు.
” మొదట దేశం, ఆ తర్వాత పార్టీ, చివరన స్వప్రయోజనం.. ఇదే తమ విధానం. పదవులు తాత్కాలికం.. ప్రజల విశ్వాసమే అత్యంత ప్రధానం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల మాట వినడం, వారి గొంతుకను గౌరవించడం. ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థి ఉద్యమం నుండి కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించడం వరకు దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో గడిపారు. ధర్మేంద్ర ప్రధాన్ అందించిన సుదీర్ఘ సేవలకు మరియు కృషికి ధన్యవాదాలు” అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘ఎక్స్’ లో పోస్టు చేశారు.










