VGన్యూస్: పది రాష్ట్రాల్లోని 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం రాబోయే జూన్, జులైలో ముగియనుంది. ఈ 24 స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ బాబుల రాజ్యసభ పదవీకాలం జూన్ 21 న ముగియనుంది. అలాగే గుజరాత్ 04, జార్ఖండ్ 02, మధ్యప్రదేశ్ 03, మణిపుర్ 01, మేఘాలయ 01, రాజస్థాన్ 03, అరుణాచల్ ప్రదేశ్ 01, కర్ణాటక 04, మిజోరాం 01 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి.
రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు:
నోటిఫికేషన్ విడుదల: జూన్ 1st
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: జూన్ 8th
నామినేషన్ల పరిశీలన: జూన్ 9th
నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ: జూన్ 11th
ఎన్నికలు: జూన్ 18th ( ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
ఓట్ల లెక్కింపు: జూన్ 18th ( సాయంత్రం 5 గంటల నుంచి)










