VGన్యూస్: తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేసి విద్యా కమిషన్ రిపోర్టును సర్కారుకు అందజేసినట్లు తన రాజీనామా లేఖలో ఆకునూరి మురళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు విద్యా కమిషన్ ఛైర్మన్ గా పనిచేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.







