VGన్యూస్: బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కోల్ కతా లోని ఐటీసీ సోనార్ హోటల్ జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ICC) ప్లీనరీలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు అనే అంశంపై మంత్రి లోకేష్ మాట్లాడారు. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఏపీ ప్రత్యేకతలన్నారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.










