Home తాజా వార్తలు గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి.. కృతజ్ఞతలు చెప్పిన సీఎం రేవంత్

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి.. కృతజ్ఞతలు చెప్పిన సీఎం రేవంత్

VGన్యూస్: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగరంలోని బాపూ ఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ కు, భారత సైన్యానికి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి లభించడం, తెలంగాణ ప్రభుత్వ విజన్ లక్ష్యాలను సాధించడంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు.