VGన్యూస్: తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంను గ్రామ సర్పంచ్ మేడ్దుల రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ.. 0-5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాండవుల మహేష్, ఆశ వర్కర్లు కొమరమ్మ, సైదమ్మ, గ్రామస్తులు మెంతబోయిన సింహాద్రి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.










