VGన్యూస్: అనంతగిరి మండలంలో ఆదివారం 23 కేంద్రాల ద్వారా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి డా. ఫిరోజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23 పల్స్ పోలియో బూతుల ద్వారా 2,501 మంది 0-5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. మిగిలిన చిన్నారులకు వారి ఇంటి వద్దకే వెళ్లి పోలియో చుక్కలు వేస్తామన్నారు. పోలియో చుక్కల ద్వారానే ఈ మహమ్మారిని నిర్మూలించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు చిన్నపిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.










