VGన్యూస్: సమాజం పట్ల తమ ఉదారతను చాటుకుంటూ టీజీఎన్పీడీసీఎల్(TGNPDCL) ఉద్యోగులు గొప్ప మానవతా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని ఉద్యోగులు స్వచ్ఛందంగా అందిస్తున్న విరాళాలతో ఏర్పాటు చేసిన టీజీఎన్పీడీసీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనాథ పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, పేద విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సేవలందిస్తున్న సేవాసంస్థలకు నిరంతర ఆర్థిక సహాయం అందచేస్తున్నారు.
ఈ సంస్థలోని ప్రతి ఉద్యోగి నెలకు కనీసం రూ.50 చొప్పున, అంతకంటే ఎక్కువ మొత్తాన్ని స్వచ్ఛందగా విరాళం అందిస్తూన్నారు. ఈ నిధులను సమాజంలోని అవసరమైన వర్గాలకు చేరేలా పారదర్శక విధానంలో వినియోగిస్తూ, ప్రస్తుతం టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 సర్కిళ్లలో సేవలందిస్తున్న 27 సేవా సంస్థలకు ప్రతి నెల రూ.20,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఉద్యోగులు ఇటు వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమతొ పాటు, సామజిక సేవలలోను తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు.






