VGన్యూస్: తెలంగాణ పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 7,437 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్, జైళ్ల శాఖ విభాగల్లో ఖాళీగా ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ల పూర్తి వివరాలకు అధికారిక వైబ్ సైట్ tgprb ను సందర్శించాలని సూచించింది.







