VGన్యూస్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్బీనగర్ చెందిన రాసోజు లక్ష్మీనారాయణ చారికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) చెక్కును విశ్వకర్మ సంఘం రాష్ట్ర నాయకులు కొండపర్తి బాల బ్రహ్మచారి లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కొండపర్తి బాల బ్రహ్మచారి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాసోజు లక్ష్మీనారాయణ చారి అనారోగ్య సమస్యను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తక్షణమే మంత్రి వెంకట్ రెడ్డి స్పందించి .. సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డికి బాల బ్రహ్మచారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసర సమయంలో స్పందించి ఈ నిధులు మంజూరయ్యేలా కృషి చేసిన తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లక్ష్మీనారాయణ చారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కొండపర్తి బాల బ్రహ్మచారికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.










