Home జాతీయం & అంతర్జాతీయం ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ శాసనసభ్యుడు, టీడీపీ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) (57) కన్నుమూశారు. విశాఖపట్టణంలో మంగళవారం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆళ్ల నాని మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆళ్ల నాని ఏలూరు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. అలాగే ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. జగన్ హయాంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2025లో ఆళ్ల నాని తెదేపాలో చేరారు.