VGన్యూస్: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రపంచ ప్రఖ్యాత దాత, ఆగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ (AKDN) ఛైర్మన్ ప్రిన్స్ రహీం ఆగాఖాన్-V తో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా ఆయన్ను సీఎం ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వారసత్వ సంపద పరిరక్షణ, మూసీ నది పునరుజ్జీవనం, సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణకు ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారం తదితర అంశాలపై ప్రిన్స్ రహీం ఆగాఖాన్-V తో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ భేటీలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, AKDN ప్రతినిధులు పాల్గొన్నారు.







