Home తెలంగాణ హజ్ యాత్ర బస్సులను ప్రారంభించిన సీఎం

హజ్ యాత్ర బస్సులను ప్రారంభించిన సీఎం

VGన్యూస్: హజ్ యాత్రకు బయలుదేరే యాత్రికుల బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. యాత్రకు వెళ్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రజాప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. హిందూ ముస్లింలు తనకు రెండు కళ్ల లాంటివారన్నారు. హిందూ ముస్లింలు ఇద్దరూ అన్నదమ్ములని, కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు సాగుదామని అన్నారు.

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో మైనారిటీల భాగస్వామ్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మైనారిటీల నిష్పత్తి మేరకు వారికి దక్కాల్సిన సంక్షేమ పథకాలు దక్కుతాయని స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన రేట్లు పెరిగాయన్న కారణంగా ఒక్కొక్క యాత్రికుడిపై 10 వేల రూపాయల అదనపు భారాన్ని కేంద్రం మోపిందన్నారు. దాదాపు 7 వేల మంది యాత్రికులపై పడిన అదనపు భారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ , ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండీ, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, మైనారిటీ విద్యా సంస్థల సొసైటీ అధ్యక్షుడు ఫహీమ్ ఖురేషీ, హజ్ కమిటీ ఛైర్మన్ గులామ్ అఫ్జల్ బియాబని , వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని, TGMFC ఛైర్మన్  ఒబేదుల్లా కొత్వాల్, ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ తాహెర్ బిన్ హమ్దన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.