VGన్యూస్: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై కొన్ని రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే పార్టీ అధినేత విజయ్ మరోసారి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సంఖ్యా బలం తమకు ఉన్నట్లు విజయ్ గవర్నర్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్ ను కోరారు.










