VGన్యూస్:బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా ఆపార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలకు ఇంఛార్జీలను ప్రకటించారు. అలాగే ప్రతీ నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున ఐటీ నిపుణుతో కలిపి తెలంగాణ భవన్ లో డిజిటల్ శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. అలాగే అన్ని జిల్లా కార్యాలయాల్లో నియోజకవర్గాల వారీగా కూడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయిన వెంటనే, సభ్యత్వ నమోదు తేదీని ప్రకటిస్తామని తెలిపారు.







