Home ఆధ్యాత్మికం రామాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య

రామాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య

VGన్యూస్: కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని శుక్రవారం కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సందర్శించారు. ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. శ్రీ సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని.. పశు సంపద పెరిగి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవున్ని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దొంతగాని అప్పారావు, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు,భక్తులు పాల్గొన్నారు.