VGన్యూస్: తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో ఓటర్లకు ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడ్దుల రమేష్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి ఓటరుకు బీఎల్వోల ద్వారా ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలు అందించడం జరుగుతుందన్నారు. ఓటర్లు జాగ్రత్తగా ఈ ఫారాల్లో వివరాలను పూర్తి చేసి మళ్లీ బీఎల్వోలకు అందజేయాలన్నారు. ఓటు హక్కు చాలా విలువైనదని.. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఓటర్లందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వెంకటమల్లు, బీఎల్వో వర్ధెల్లి శారద, బీఎల్ఏ లు సింహాద్రి, కర్ణాకర్, వార్డు సభ్యుడు సందీప్, పాపయ్య, దాసు, గ్రామస్తులు పాల్గొన్నారు.










