VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బుధవారం వరంగల్ లోని భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం పవన్ కళ్యాణ్ కు పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.










