Home తాజా వార్తలు కేంద్రమంత్రులతో రాష్ట్ర మంత్రి వివేక్ భేటీ

కేంద్రమంత్రులతో రాష్ట్ర మంత్రి వివేక్ భేటీ

VGన్యూస్: ఢిల్లీలో సోమవారం పలువురు కేంద్రమంత్రులను కలిసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి కేంద్ర కార్మిక & ఉపాధి శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవీయ, కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, రాష్ట్రానికి అవసరమైన సహకారం అందించాలని కోరినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేస్తూ, ప్రజలకు మరింత మెరుగైన అవకాశాలు, అభివృద్ధి ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని మంత్రి వివేక్ తెలిపారు.