Home తాజా వార్తలు వనస్థలిపురం ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కమిషనర్

వనస్థలిపురం ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కమిషనర్

VGన్యూస్: ప్రజా సేవలో నాణ్యతే తమ లక్ష్యమని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి (B.Sumathi IPS) అన్నారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించాలనే లక్ష్యంతో మంగళవారం వనస్థలిపురం ఏసీపీ కార్యాలయాన్ని (Vanasthalipuram Acp Office) తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ నిర్వహణ, రికార్డుల భద్రపరచడం, పెండింగ్ అంశాల పరిష్కారం, ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని కమిషనర్ సమీక్షించారు. ప్రతి అధికారి ప్రజాకేంద్రిత దృక్పథంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.