VGన్యూస్: జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల (T20) సిరీస్ ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్ లో (ZIM vs IND ) భారత జట్టు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మెుదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 192 పరుగులు చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 49 బంతుల్లో 81 పరుగులు చేసి తన సత్తాచాటాడు. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 7 వికెట్లను కోల్పోయి 157 పరుగులకే పరిమితమైంది. ర్యాన్ బుర్ల్ 43 బంతుల్లో54* పరుగులతో రాణించాడు.










