VGన్యూస్: ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో బెంగళూరుపై హైదరాబాద్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్.. మెుదట బ్యాటింగ్ కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 255 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 79, అభిషేక్ శర్మ 56, క్లాసెన్ 51 పరుగులతో రాణించారు. ఆ తర్వాత 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 200 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లు రజత్ పాటీదార్ 56, వెంకటేష్ అయ్యర్ 44 పరుగులతో రాణించారు. చివర్లో కృనాల్ పాండ్య 31 బంతుల్లో 41 పరుగులు చేశారు. ఆర్సీబీపై హైదరాబాద్ విజయం సాధించినప్పటికీ పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మూడో స్థానానికే పరిమితమైంది.










