VGన్యూస్: అరుణ్ జైట్లీ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మెుదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ పాథుమ్ నిశాంక 50, అశుతోశ్ శర్మ 39, కేఎల్ రాహుల్ 23 పరుగులతో రాణించారు. 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం 14.2 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ 100, కామెరూన్ గ్రీన్ 33 పరుగులతో రాణించారు.










