VGన్యూస్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే సెవెన్ హిల్స్, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కార్మికులతో మాట్లాడి అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.










