Home క్రీడలు & సినిమా 8 పరుగల తేడాతో శ్రీలంకపై భారత్ విజయం

8 పరుగల తేడాతో శ్రీలంకపై భారత్ విజయం

VGన్యూస్: ముక్కోణపు వన్డే సిరీస్ లో దంబుల్లా వేదికగా మంగళవారం ఉత్కంఠ భరితంగా సాగిన తొలి మ్యాచ్ లో శ్రీలంక Aజట్టుపై భారత Aజట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి మెుదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 277 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్ 101, తిలక్ వర్మ 60 పరుగులతో రాణించారు. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.5 ఓవర్లలోనే 269 పరుగులు చేసి ఆలౌటైంది.