Home జాతీయం & అంతర్జాతీయం ఇది ప్రజాస్వామ్య విజయం: సోనమ్ వాంగ్‌చుక్

ఇది ప్రజాస్వామ్య విజయం: సోనమ్ వాంగ్‌చుక్

VGన్యూస్: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ శనివారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనిపై సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించారు.
“ఇది ప్రజాస్వామ్య విజయం. శాంతి, సహనం మరియు పట్టుదలకు దక్కిన విజయం. భయాన్ని వీడి దేశం నలుమూలల నుంచి గళమెత్తిన పౌరులందరికీ ధన్యవాదాలు. CJPకి మరియు దేశంలోని Gen Z యువతకు అభినందనలు” అంటూ సోనమ్ వాంగ్ చుక్ ‘ఎక్స్’ లో పోస్టు చేశారు.