VGన్యూస్: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఏపీ గృహనిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రోన్ల వినియోగంతో పాటు కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా చాటిచెప్పేలా ప్రత్యేక విజువల్ కంటెంట్ సిద్ధం చేయాలని సమాచార శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.










