Home తెలంగాణ ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

VGన్యూస్: తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వర్దేల్లి లింగయ్య గౌడ్ మాట్లాడుతూ.. గౌడ కులంలో పుట్టి పేద ప్రజల తరఫున పోరాడిన పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. మొగల్ సామ్రాజ్య రాజులను ఎదిరించి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకొని బహుజన రాజ్యాన్ని స్థాపించిన వీరుడని తెలిపారు.ఈ కార్యక్రమంలో వగలగాని వెంకన్న, వగలగాని వీరయ్య, వర్దేల్లి సత్యనారాయణ, గుండగాని సందీప్, వర్దేల్లి వీరభద్రం, రాము, వెంకన్న, హరీష్, తదితరులు పాల్గొన్నారు.